
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంజినీర్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నదిలోకి దూకిన ఘటన కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రాజమహేంద్రవరంలోని రైల్వే బ్రిడ్జిపై నుంచి వారు నదిలోకి దూకినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఇంజినీర్ పిఠాపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నలుగురూ నదిలోకి దూకినప్పటికీ, ఇంజినీర్ కుమారుడు ఈత కొట్టి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
మరోవైపు, ఇంజినీర్, అతని భార్య, మరో కుమారుడి ఆచూకీ కోసం పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

