పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఇక నుంచి యూఏఎన్ వెబ్ సైట్‌లోకి వెళ్లాల్సిన పని లేదు. మీ వాట్సప్‌లోనే సులువుగా సెకన్లలోనే చెక్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఈపీఎఫ్ఓ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలా చెక్ చేసుకోవాలనేది డీటైల్డ్‌గా ఇప్పుడు చూద్దాం.

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) భారీ శుభవార్త అందించింది. ఖాతాదారులకు సులభతరంగా డిజిటల్ సేవలు అందించేందుకు వాట్సప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత కొంతకాలంగా ఆన్‌లైన్ సేవలను మరింత విస్తరిస్తున్న ఈపీఎఫ్ఓ.. ఇటీవల వాట్సప్ ఛానెల్ కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ ఛానెల్ ద్వారా పీఎఫ్ అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు పొందవచ్చు. ఖాతాదారులకు సులువుగా సమాచారం అందించేందుకు ఈ కొత్త సదుపాయం తీసుకురాగా.. తాజాగా వాట్సప్ నెంబర్ తీసుకొచ్చింది. ఈ నెంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ చేయడం ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్, పాస్ బుక్ డౌన్లోడ్, చివరి ఐదు లావాదేవీలు తెలుసుకోవచ్చు.

వాట్సప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా..?

– ముందుగా పీఎఫ్ వాట్సప్ నెంబర్ 8796441800ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి

-ఆ తర్వాత వాట్సప్ తెరిచి ఆ నెంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ పెట్టండి

-అనంతరం మీకు నచ్చిన భాషను ఎంచుకోండి

– మెనూ నుండి బ్యాలెన్స్ చెకింగ్ ఆప్షన్ ఎంపిక చేసుకోండి

-ఈపీఎఫ్ఓ రికార్డుల్లో ఉన్న మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయండి

-మీ కంపెనీని ఎంచుకోండి

-ఆ తర్వాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు అందుతాయి

పీఎఫ్ పాస్ బుక్ డౌన్‌లోడ్ ఎలా..?

-వాట్సప్‌లో 8796441800 నెంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ చేయండి

-మీ బాషను ఎంపిక చేసుకోండి

-మెనూ నుంచి పాస్ బుక్ డౌన్ లోడ్ ఆప్షన్ ఎంచుకోండి

-మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయండి

-మీ కంపెనీ వివరాలను సెలక్ట్ చేసుకోండి

-అనంతరం పాస్ బుక్ డౌన్ లోడ్ ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది

-పీడీఎఫ్ ఫార్మట్‌లో పాస్ బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు –

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *