
భోగాపురం, మురసు తుపాను ప్రభావం విమాన సర్వీసులపై పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో భోగాపురంలోని ఏఎస్‌ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ వెళ్లాల్సిన విమానాలను రద్దు చేశారు.
తుపాను కారణంగా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విమాన ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు సంబంధిత ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో సర్వీసుల తాజా వివరాలను తెలుసుకోవాలని అధికారులు సూచించారు. విమానాల రద్దు, సమయాల్లో మార్పులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు.
