నెల్లూరు జిల్లా వెంకటాచలంలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. స్థానిక పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం మొదలై, చివరకు తోపులాటకు దారితీసింది.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాల వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద నెలకొన్న ఉద్రిక్తత సద్దుమణిగింది.
For more: MPTC, ZPTC Elections Live Updates in DTV Digital
