ఒకప్పటి ఐపీఎల్ ప్లేయర్.. కాబోయే ఆర్సీబీ ఛైర్మన్.. ఎవరీ ఆర్యమాన్ బిర్లా?

Date:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీని కొత్త యాజమాన్యం కొనుగోలు చేసిన విషయం తెలిసింది. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ కన్సార్టియం ఆర్సీబీని దక్కించుకుంది. ఇందుకోసం ఏకంగా రూ.16,706 కోట్లు వెచ్చించింది. అయితే ఆర్సీబీ కొత్త ఛైర్మన్‌గా ఆర్యమాన్ బిర్లా బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న అతడు.. తాజాగా ఆర్సీబీకి ఛైర్మన్ అయ్యాడు.

ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమ్మకం పూర్తయింది. ప్రారంభ సీజన్ నుంచి ఫ్రాంఛైజీని నడిపిస్తున్న యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్(యుఎస్ఎస్) సంస్థ తాజాగా.. రూ.16,706 కోట్ల ధరకు ఆర్సీబీని అమ్మేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ కన్సార్టియం ఆర్సీబీని దక్కించుకున్నాయి. ఈ డీల్ తర్వాత ఆర్సీబీకి ఆర్యమాన్ బిర్లా కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. దీంతో ఆర్యమాన్ బిర్లా ఎవరూ అనేది ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

ఆర్యమాన్ బిర్లా.. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా కుమారుడు. 28 ఏళ్ల ఆర్యమాన్ గతంలో క్రికెట్‌నే తన కెరీర్‌గా ఎంచుకున్నాడు. మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్ అడాడు. ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్, ఆర్సీబీ జట్టులోని వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి మ్యాచులు ఆడాడు. మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 9 మ్యాచుల్లో 414 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉండటం గమనార్హం.

ఇక ఐపీఎల్‌లోనూ ఆర్యమాన్ బిర్లా అడుగుపెట్టాడు. 2018 సీజన్‌కు ముందు జరిగిన వేలంలో అతడిని రాజస్థాన్ రాయల్స్ రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది. అయితే మూడేళ్ల పాటు ఫ్రాంఛైజీలో కొనసాగినా.. ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా అతడికి రాలేదు. 2020లో రాజస్థాన్ రాయల్స్.. ఆర్యమాన్‌ను రిలీజ్ చేసింది. ఆ తర్వాత డొమెస్టిక్‌ క్రికెట్, ఐపీఎల్‌లోనూ ఆర్యమాన్‌కు అవకాశాలు రాలేదు. దీంతో కెరీర్ మధ్యలోనే తీవ్రమైన ఒత్తిడి కారణంగా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని.. అతడు ఆటకు వీడ్కోలు పలికాడు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

చక్కెర లేకుండానే మఖానా కీర్.. ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసా?

మఖానా కీర్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు...

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...