Gold Price Crash: 43 ఏళ్ల రికార్డ్ బ్రేక్ కుప్పకూలిన బంగారం, వెండి త్వరలో మరింత తగ్గే ఛాన్స్!

Date:

సాధారణంగా బంగారం ధరలు పెరగడం తప్ప తగ్గడం చాలా వరకు జనాలు చూసి ఉండరు. గత రెండు, మూడేళ్ల క్రితం తలం బంగారం ధర రూ.60వేలుగా ఉండగా ఇప్పుడు ఇది రూ.1,50లక్షల దాకా చేరింది. కానీ గడిచిన గత వారం రోజుల్లో ఏకంగా బంగారం ధరలు పాతాలానికి పడిపోయాయి.

ఇది బంగారం మార్కెట్‌లోలో బిగ్ ఎర్త్ క్వేక్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే గత 43 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ సారి బంగారం ధరలు కుప్పకూలాయి. అసలు బంగారం ధరల పథనానికి అసలు కారణం ఏంటో చూద్దాం పదండి.

గత కొన్ని నెలలుగా వేగంగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం పాతాళానికి పడిపోయాయి. కేవలం వారం రోజుల్లోనే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 5,200 డాలర్ల నుంచి 4,400 డాలర్లకు పడిపోయింది. ఇది బంగారంపై ఇన్వెస్ట్ చేసిన అందరినీ షాక్‌కి గురిచేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరలు పడిపోవడంతో. దేశీయ మార్కెట్లపై కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది.ఈ దెబ్బతో గోల్డ్ లోన్ తీసుకున్న సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బంగారం తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్న వారికి.. బ్యాంకుల నుంచి మార్జిన్ కాల్స్ మొదలయ్యాయి.

బంగారం ధరలు తగ్గడంతో ఎల్‌టీవీ రేషియో పెరిగిపోయి.. అదనపు నగలు లేదా నగదు కట్టాలని బ్యాంకులు డిమాండ్ చేస్తున్నాయి.మరోవైపు వెండి ధరలు కూడా బేజారెత్తిస్తున్నాయి. ఎంసీఎక్స్‌లో వెండి కిలోకు ఏకంగా 12 శాతం మేర పతనమైంది.

ఇరాన్ టెన్షన్ల వల్ల క్రూడాయిల్ సరఫరాపై పెట్రోలియం శాఖ ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించింది.రష్యా, టర్కీ లాంటి దేశాలు తమ గోల్డ్ రిజర్వులను మార్కెట్‌లో అమ్మేస్తుండటంతో. ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో బంగారం ధర 4,100 డాలర్ల మార్కుకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...