బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. గత రెండు రోజులుగా పసిడి, వెండి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావంతో విలువైన లోహాల ధరల్లో క్షీణత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి భారీగా తగ్గాయి.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.2,570 తగ్గగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.2,350 మేర తగ్గుదల నమోదైంది. అటు వెండి ధర కూడా కిలోకు రూ.5,000 తగ్గింది. వరుసగా రెండో రోజు ధరలు దిగిరావడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది.

రూ.1.30 లక్షలకు చేరిన 24 క్యారెట్ల బంగారం

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం.. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,570 తగ్గి రూ.1,30,690 వద్దకు చేరింది. అంతకుముందు రోజుతో పోలిస్తే ఈ తగ్గుదల గణనీయంగా ఉంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,350 మేర తగ్గింది.

ఇటీవలి కాలంలో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు వరుసగా రెండో రోజు తగ్గడం బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి కొంత ఊరటనిస్తోంది. వెండి ధరలోనూ భారీ తగ్గుదల నమోదు కావడంతో మార్కెట్లో కొనుగోళ్లపై ఆసక్తి నెలకొంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *