Gold Prices: శ్రావణ శుక్రవారం వేళ మహిళలకు షాక్.. ఒకేసారి భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

Date:

బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. గత కొద్దిరోజులుగా ధరల్లో భారీగా పెరుగుదల నమోదవుతోంది. శ్రావణ శుక్రవారం వేళ మహిళలకు షాక్ తగిలింది. శుక్రవారం ధరలు భారీగా పెరిగి రూ.1.60 లక్షల మార్క్‌ను దాటాయి. గత నెల నుంచి ధరలు భారీగా పెరుగుతూ షాకిస్తున్నాయి.

శ్రావణ శుక్రవారం అంటేనే మహిళలందరికీ ముఖ్యమైన రోజు. ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేసుకుంటూ ఉంటారు. దీంతో ఇది ముఖ్యమైన పండుగగా చెప్పవచ్చు. ఈ పండుగ రోజున మహిళలకు షాక్ తగిలింది. బంగారం ధరలు భారీగా పెరిగాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతుండటం, ఇరాన్‌పై ఆర్ధిక ఆంక్షలను తీవ్రతరం చేయాలని అమెరికా భావిస్తుండటంతో మార్కెట్లపై దీని ప్రభావం పడింది. ఈ క్రమంలో బంగారం ధరలు ఒత్తిడికి లోనవుతున్నాయి

హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,990గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,658 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,200గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,850 వద్ద కొనసాగుతోంది

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,870 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రైూ.1,46,548గా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,510 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,218గా ట్రేడవుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,740 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,218గా ట్రేడవుతోంది. కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,530గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,236 వద్ద ట్రేడవుతోంది.

వెండి ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,45,610 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కేజీ సిల్వర్ రూ.2,45,940గా ఉండగా.. బెంగళూరులో రూ.2,45,420 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీలో కేజీ సిల్వర్ రూ.2,44,560 వద్ద కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...