తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్! సంక్రాంతికే రైతు భరోసా డబ్బులు! కానీ, ఒక్క కండిషన్!

Date:

తెలంగాణలోని అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. సాగు పెట్టుబడి కోసం ఇచ్చే ఈ సాయాన్ని పక్కాగా అర్హులకు మాత్రమే అందించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఆధునిక సాంకేతికతను వాడుతూ భారీ ప్రక్షాళనకు తెరలేపింది.

పథకాల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈసారి ‘శాటిలైట్ మ్యాపింగ్’ సర్వేను ఆయుధంగా ఎంచుకుంది. సింథటిక్ ఎపర్చర్ రాడార్ (SAR) టెక్నాలజీ ద్వారా ఏ భూమిలో పంట సాగవుతోంది? ఏది బీడు భూమి? అనేది అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొండలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, వాణిజ్య భవనాలు ఉన్న భూములకు కూడా గతంలో రైతు భరోసా నిధులు వెళ్లినట్లు ఈ సర్వేలో తేలింది. ఈ అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పుడు పక్కా సాగులో ఉన్న భూములకే నిధులు ఇవ్వాలని డిసైడ్ అయింది.

అన్నదాతలకు పండుగ తీపి కబురు అందిస్తూ.. సంక్రాంతి పండుగ లోపు అంటే జనవరి 13 లేదా 14వ తేదీలలో డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎకరాకు రూ. 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందనుంది. ఇప్పటికే నిధులు సిద్ధం చేసిన ప్రభుత్వం.. సర్వే నివేదిక అందగానే లబ్ధిదారుల తుది జాబితాను విడుదల చేయనుంది

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....