పెడన, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు వేడుకల్లో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెడన పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్‌ మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం కేక్‌ కటింగ్‌ కార్యక్రమం నిర్వహించి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవ, పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్‌ కళ్యాణ్‌ మరింత శక్తి, ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, పెడన నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పంచకర్ల సురేష్‌, జనసేన నాయకులు విక్కుర్తి శ్రీనివాస్‌, గరికిపాటి శివ, కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *