
మాల్, నవంబర్ 23: దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలను సోమవారం చింతపల్లి మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని గోడకొండ గ్రామ పంచాయతీ వీటీనగర్‌లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి రవీంద్ర కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురికి పండ్లు పంపిణీ చేశారు. రవీంద్ర కుమార్ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మల్లూరు జగన్ చారి, కాలేధ్, బాదేపల్లి పులి రాజు గౌడ్, అశోక్, బాదేపల్లి నిరంజన్ గౌడ్, కంకణాల రాజు, రామకృష్ణ, బి. లక్ష్మణ్‌తో పాటు వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




