ఫ్యాటీ లివర్ తగ్గడానికి + లివర్‌ ఆరోగ్యానికి ఇంటి చిట్కాలు, మన ఇంటి చుట్టూ కనిపించే నేల ఉసిరి పొడి చాలు

Date:

మన ఇంటి చుట్టూ, పొలాల గట్లపై, ఖాళీ స్థలాల్లో కనిపించే నేల ఉసిరిని చాలామంది సాధారణ అడవి మొక్కగా భావిస్తారు. కానీ ఆయుర్వేదంలో మాత్రం ఈ చిన్న మొక్కను విలువైన ఔషధ మూలికగా పరిగణిస్తారు. కేవలం అడుగు ఎత్తు వరకు పెరిగే ఈ మొక్క మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నేల ఉసిరి నీరు తరచు తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నేల ఉసిరి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.

మన ఇంటి చుట్టూ, పొలాల గట్లపై, ఖాళీ స్థలాల్లో కనిపించే . కానీ వాటి గురించి సరైన అవగాహన లేక చాలామంది వాటిని పిచ్చి మొక్కలుగా భావించి తొలగిస్తుంటారు. అలాంటి మొక్కల్లో నేల ఉసిరి ఒకటి. కేవలం అడుగు ఎత్తు వరకు పెరిగే ఈ చిన్న మొక్క ఆకుల అడుగు భాగంలో వరుసగా చిన్న కాయలు ఉంటాయి.

నేల ఉసిరిలో పోషకాలు, ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. దీనిలో టానిన్స్‌, ఆల్కలాయిడ్స్‌, విటమిన్ c, ఫైటోకెమికల్స్, లిగ్నన్స్‌, సపోనిన్స్‌, ఫ్లేవనాయిడ్స్‌ ఉంటాయి. దీనిలో హిమటోప్రొటెక్టివ్‌, యాంటీ వైరల్‌, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. నేల ఉసిరి నీటిని తరచూ తీసుకుంటే  పొందవచ్చో ఈ స్టోరీలో చూద్దాం

కిడ్నీలో కాల్షియం క్యాల్షియం ఆక్సలేట్‌ స్పటికాలు ఒకదానితో ఒకటి జతకూడి కిడ్నీల్లో రాళ్లుగా ఏర్పడకుండా నేల ఉసిరి దోహపడుతుంది. ఇది మూత్ర కండరాలను సడలించడం ద్వారా చిన్న చిన్న రాళ్లు నొప్పిలేకుండా మూత్రం ద్వారా సులభంగా బయటకు వెళ్లిపోతాయి. ఇది మూత్రాన్ని ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేసి కిడ్నీల్లో ఉన్న వ్యర్థాలను, చిన్న వ్యర్థ స్పటికాలను బయటకు పంపిస్తుంది. నేల ఉసిరి పొడి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. దీనిని అర టీ స్పూన్‌ తీసుకుని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగొచ్చు. అయితే ఈ చిట్కా పాటించే ముందు ఒకసారి నిపుణుల సలహా తీసుకోండి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...