మండలంలోని సంతపేట కూడలి వద్ద ఉన్న బొమ్మల తయారీ కేంద్రం శనివారం అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో విగ్రహాలతో పాటు వాటి తయారీకి వినియోగించే ముడిసరుకు కాలిపోయింది.

రంగరాయపురం గ్రామానికి చెందిన ఎం. గోవింద కొంతకాలంగా సంతపేట వద్ద వినాయకుడు, దేవి, గౌరమ్మ విగ్రహాలను తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ప్రమాదవశాత్తు బొమ్మల తయారీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఎస్‌.కోట అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

విషయం తెలుసుకున్న ఆర్‌ఐ సన్యాసిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి జరిగిన నష్టాన్ని తహసీల్దార్‌కు వివరించారు. స్థానిక ఎమ్మెల్యే లలితకుమారి జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అగ్నిప్రమాదంలో జరిగిన నష్టాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *