బంగాళాఖాతంలో మరో రెండు తుఫాన్లు ఈ ఏడాది చివరినాాటికి ఏర్పడే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నాయి. మార్చి వరకు ఎల్‌నివో ప్రభావం ఉంటుందని, ఆ తర్వాత బలహీనపడుతుందని చెబుతున్నారు. ఆ తర్వాత వర్షాలు సమృద్దిగా కురుస్తాయని అంటున్నారు. అయితే ఈ తుఫాన్ల ప్రభావం ఏపీకి ఉంటాయా.. లేదా అనేది వెల్లడించలేదు.

ప్రజలకు బిగ్ అలర్ట్. మరో రెండు తుఫాన్ల గండం పొంచి ఉంది. ఈ విషయాన్ని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (INCOIS) శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటికే అర్నబ్, మురసు తుఫాన్లు ఏపీలో విధ్వంసం సృష్టించగా.. అక్వాన్ తుఫాన్ దిశ మార్చుకుని ఒడిశా వైపు వెళ్లడంతో ఏపీకి ప్రమాదం తప్పింది. అయితే ఈ నెల చివరిలో లేదా డిసెంబర్ రెండో వారంలో తుఫాన్ల ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఈ తుఫాన్లు ఏర్పడనున్నాయని తెలిపారు. అండమాన్ సముద్రంలో ఈ నెల చివరినాటికి తక్కువ ఒత్తిడి ప్రాంతం ఏర్పడే అవకాశముందని, దీని వల్ల తుఫాన్లు ఏర్పడే చాన్సుందని అంటున్నారు.

ఈ నెలాఖరుకు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. ఇది మరింత బలపడి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని, వచ్చే నెల నాలుగో తేదీ తర్వాత ఇది శ్రీలంక, దక్షిణ తమిళనాడు దిశగా వెళ్లనుందని అంచనా వేశారు. అలాగే డిసెంబర్ రెండో వారంలో మరో తుఫాన్ ఏర్పడే సూచనలు కనిపిస్తుండగా.. దీనికి గురించి ఇప్పుడే అంచనా వేయలేమని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి తర్వాత ఎల్‌నివో ప్రభావం తగ్గుతుందని, మార్చి తర్వాత బలహీనపడతుందని అంచనా వేశారు. 2027లో నైరుతి రుతుపవనాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని హైదరాబాద్‌లోని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (ఇన్‌కాయిస్) శాస్త్రవేత్తలు తెలిపారు.

నవంబర్ నుంచి 2027 మార్చి వరకు ఎల్‌నినో కొనసాగడానికి 87 నుంచి 100 శాతం అవకాశముందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆ తర్వాత క్రమక్రమంగా బలహీన పడుతుందన్నారు. వచ్చే ఏడాది వేసవి తర్వాత వర్షాలు సమృద్దిగా కురిసే అవకాశముందని అంటున్నారు. వర్షాలు అనేవి ఎల్‌నివో, లానినా పరిస్థితులపై ఆధారపడి ఉండదని, సముద్ర ఉష్ణోగ్రతలు, వేగం వంటి అంశాలు ప్రభావితం చూపిస్తాయని చెప్పారు. అయితే ఈ తుఫాన్లు ఏపీలో ప్రభావితం చూపిస్తాయా.. లేదా అనేది మాత్రం శాస్త్రవేత్తలు వెల్లడించలేదు. వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. దీంతో ఈ తుఫాన్ల ప్రభావం అనేది ఏపీకి ఉంటుందా.. లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. తాజా వాతావరణ అంచనాలను వాతావరణశాఖ ప్రతీ రోజూ జారీ చేస్తూ ఉంటుంది. వీటిని ప్రజలు గమనించాలి. కాగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి, ఉదయం వేళల్లో చలిపులి విజృంభిస్తుండగా.. పగటి వేళల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *