‘ఐఐఎం విశాఖ’కు అంతర్జాతీయ గుర్తింపు.. లండన్ బీజీఏ నుంచి అక్రిడిటేషన్‌

Date:

విశాఖపట్నం ఆనందపురం మండలం గంభీరంలో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ విశాఖపట్నం(ఐఐఎంవీ)కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. లండన్ బిజినెస్‌ గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌ నుంచి ఐఐఎంవీ అక్రిడిటేషన్‌ లభించింది. ఐదేళ్ల కాలానికి ఈ అక్రిడిటేషన్ దక్కింది. ఈ గుర్తింపుతో ఐఐఎంవీ ప్రపంచస్థాయిలో ప్రతిష్ట మరింత పెరిగిందని ప్రొఫెసర్ చంద్రశేఖర్ అన్నారు. అందరి సమిష్టి కృషితో ఇది సాధ్యమైంది అన్నారు.

విశాఖపట్నం ఐఐఎం (ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌)కు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. లండన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక బీజీఏ (బిజినెస్‌ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్‌) విశాఖపట్నం ఐఐఎంకు ఐదేళ్ల అక్రిడిటేషన్‌ వచ్చింది. బీజీఏ నుంచి అక్రిడిటేషన్‌ లభించినట్లు ఐఐఎంవీకి సమాచారం అందింది. అత్యున్నత విద్యా ప్రమాణాలను పాటించే విద్యా సంస్థలకు ఈ గుర్తింపు లభిస్తుందని చెబుతున్నారు. దేశంలోనే అత్యుత్తమ బిజినెస్ స్కూళ్ల జాబితాలో ఐఐఎంవీ చేరిందని డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎం చంద్రశేఖర్‌ తెలిపారు. ఐఐఎం విద్యార్థుల భాగస్వామ్యం, టీచింగ్, నాన్ టీచింగ్ సమిష్టి కృషితో అక్రిడేషన్ సాధ్యమైంది అన్నారు.

ఈ గుర్తింపు అంతర్జాతీయ ప్రమాణాల విషయంలో తమ నిబద్ధతకు నిదర్శనమని ప్రొఫెసర్ చంద్రశేఖర్ అన్నారు. నాణ్యమైన విద్య, బాధ్యతాయుతమైన నిర్వహణ, అభివృద్ధి ఐఐఎం విలువలని.. ఈ అక్రిడిటేషన్‌ వాటిని మరింత ప్రతిబింబిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ గుర్తింపుతో ప్రపంచస్థాయిలో ఐఐఎంవీ ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు. ఐఐఎంలో విద్యావిధానం, విద్యార్థుల భాగస్వామ్యం, అధ్యాపకుల నైపుణ్యం, పరిపాలన వంటి పలు అంశాలను బీజీఏ పరిశీలించిన తర్వాతే అక్రిడిటేషన్‌ ఖరారు చేశారన్నారు. ఐఐఎంవీలో వినూత్నమైన విద్యా ప్రణాళిక, స్టార్టప్‌లకు ఇస్తున్న ప్రోత్సాహంతో పాటుగా విద్యాబోధనను నిపుణుల బృందం ప్రశంసించినట్లు తెలిపారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...