3 నెలల్లోనే 25 శాతం పడిపోయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు.. ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు

Date:

భారత స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒత్తిడి నెలకొంది. కొంత కాలంగా ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకులు నెలకొన్నాయి. దీంతో పెద్ద పెద్ద స్టాక్స్ కూడా దారుణంగా పతనం అయ్యాయి. అయితే ఇందులో ప్రముఖంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు గురించి తెలుసుకోవాలి. ఇది ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు రికార్డ్ స్థాయిలో 25 శాతం కుదేలైంది. ఈ స్టాక్ పతనానికి ఇతర చాలా కారణాలే ఉన్నాయి.

స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకొని ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఎన్నో అంశాలు స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంటాయి. అయితే స్వల్ప కాలంలో కంటే దీర్ఘకాలంలో మాత్రం స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తుంటాయి. ఇంకా.. అంతర్జాతీయంగా అనిశ్చితి.. ఇతర అంశాలతో కొన్ని స్టాక్స్ దారుణంగా పడిపోతుంటాయి. గత కొంత కాలంగా భారత స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడుదొడుకుల్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. గతేడాది జనవరిలో బాధ్యతలు చేపట్టాక.. స్టాక్ మార్కెట్లు అప్పటినుంచి పడుతూనే ఉన్నాయి. దిగుమతి సుంకాల్ని పెంచగా.. స్టాక్ మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది. ఇతర దేశాలతో కవ్వింపులు.. చైనాతో వాణిజ్య యుద్ధం కూడా ప్రభావం చూపింది. దీంతో స్టాక్ మార్కెట్లలో నష్టాలు వస్తూనే ఉన్నాయి.

ఇటీవల మళ్లీ ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం మరింత ఒత్తిడిని పెంచింది. దీంతో స్టాక్ మార్కెట్లు మార్చి నెలలో మరింత భారీగా పతనం అయ్యాయి. సెన్సెక్స్ మార్చి నెలలోనే 10 శాతానికిపైగా పడిపోయింది. దీంతో పలు హెవీ వెయిట్ స్టాక్స్ ఎస్బీఐ, రిలయన్స్ సహా ఐటీ స్టాక్స్ ఇలా అన్నీ భారీగా పడిపోయాయి. ఇక్కడ అన్నింటికంటే ఎక్కువగా దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్ అధికంగా ప్రభావితమైంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

సంగం మండలం దివ్యాంగుడికి ట్రై సైకిల్ పంపిణీ!

నెల్లూరు జిల్లా, సంగం మండలం: జంగాల కండ్రిక గ్రామంలో టీడీపీ పార్లమెంట్ అధికార...

మొక్కజొన్న కొందరికి డేంజర్.. తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

మొక్కజొన్న అందరికీ మంచిదేనా? వేడివేడి బొగ్గులపై కాల్చి, నిమ్మరసం, కారం అద్దిన మొక్కజొన్న...

ముసునూరులో భారతదేశపు తొలి నాన్-GMO పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తన ఆవిష్కరణ సందర్భంగా పట్టాభి రామారావు గారి ప్రసంగం

https://www.youtube.com/watch?v=4A6it-xZoBI ముసునూరులో భారతదేశపు తొలి నాన్-GMO పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తన ఆవిష్కరణ...

Vice President C.P. రాధాకృష్ణన్ గారి ప్రసంగం: భారతదేశపు తొలి నాన్-GMO పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ ఆవిష్కరణ”

https://www.youtube.com/watch?v=BPPUSuTEhyE భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పీ. రాధాకృష్ణన్ గారు భారతదేశపు తొలి నాన్-GMO పాప్‌కార్న్...