ఒక్కరోజు మురిపెమే.. మళ్లీ ఒక్కసారిగా బంగారం ధరల్లో మార్పు.. తులం గోల్డ్ ఇప్పుడు ఎంతంటే

Date:

పసిడి ప్రియులకు అలర్ట్. బంగారం ధరలు ఇటీవల ట్రంప్ ప్రకటన తర్వాత మళ్లీ ఒక్కసారిగా భారీగా తగ్గగా అది ఒక్కరోజుకే పరిమితమైంది. మళ్లీ ఇప్పుడు గోల్డ్ రేటు పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా స్వల్పంగా ధరలు పెరిగాయి. ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు ఎక్కడ ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.

భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో వేరే చెప్పాల్సిన పని లేదు. ఎక్కువగా మహిళలు బంగారు ఆభరణాల్ని ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. పండగలు, వివాహాలు, ఇతర శుభకార్యాల సమయంలో డిమాండ్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది చెప్పొచ్చు. గతేడాది అంతర్జాతీయంగా అనిశ్చితి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం సహా రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. బంగారం కిందటేడాది 70 శాతం వరకు.. సిల్వర్ 150 శాతం వరకు పెరిగాయి. ఈ ఏడాది కూడా ఆరంభంలో భారీగానే పెరగ్గా.. మళ్లీ ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ రేట్లు దిగొచ్చాయి. ఇక్కడ క్రూడాయిల్ ధరలు పెరగడంతో.. ద్రవ్యోల్బణం భయాలు పెరిగి.. డాలర్ పుంజుకుంది. దీంతో బంగారం ధరలు దిగొచ్చాయి.

ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు కాస్త పెరిగి 4,676 డాలర్ల స్థాయిలో ఉంది. అంతకుముందు ఇది 4,600 డాలర్ల స్థాయికి పడిపోయింది. సిల్వర్ రేటు కూడా 73 డాలర్ల స్థాయికి పెరిగింది. దీంతో దీనికి అనుగుణంగానే దేశీయంగా మళ్లీ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర మాత్రం స్థిరంగానే ఉంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...