ఆ మూడు షరతులకు ఒప్పుకుంటే దీక్ష విరమిస్తా సోనమ్ వాంగ్‌చుక్ కీలక ప్రకటన..

Date:

కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ (సోమవారం) తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌కు ముందు ప్రముఖ సామాజిక కార్యకర్త సోమన్ వాంగ్‌చుక్ కీలక ప్రకటన చేశారు. 20 రోజులకు పైగా తాను చేస్తున్న నిరాహార దీక్షను ఈరోజు విరమిస్తానని ఆయన ప్రకటించారు. అయితే, తాను ప్రతిపాదించిన మూడు షరతులు నెరవేరితేనే నిరశన దీక్షను విరమిస్తానని తెలిపారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది తన మొదటి డిమాండ్‌గా వాంగ్‌చుక్ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలోని వైఫల్యాలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా నీట్ ప్రశ్నపత్రాల లీక్ ఘటనలపై సమాధానం చెప్పాలన్నారు. ప్రశ్నపత్రాల లీక్ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని రాజకీయ నాయకులు తనకు హామీ ఇవ్వాలని రెండో షరతు పెట్టారు.

మూడో డిమాండ్‌గా ఆరోగ్యం, ఇతర కారణాల వల్ల తాను ఈరోజు పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొనలేకపోతే, అగ్ర రాజకీయ నాయకులు తనను ఆస్పత్రిలో పరామర్శించి మిగిలిన రెండు షరతులపై హామీ ఇవ్వాలన్నారు. ఈ డిమాండ్లు నేరవేరిస్తే తాను దీక్షను విరమించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
కాగా, ప్రశ్నపత్రాల లీక్ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని జూన్ 28 నుంచి వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేపట్టారు.

శనివారం నాడు ఆయన దీక్షను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆస్పత్రి నుంచే ఆయన తన మూడు డిమాండ్లను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మరోవైపు నేడు పార్లమెంట్ మార్చ్‌కు సీజేపీ పిలుపునిచ్చింది. ఇప్పటికే వేల మంది విద్యార్థులు, సీజేపీ మద్దతుదారులు ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. అయితే, పోలీసులు మాత్రం వారి మార్చ్‌కు అనుమతి లేదని చెబుతున్నారు. ఈ మేరకు దేశ రాజధానిలో నేడు పెద్దఎత్తున ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...