వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య యలహంక నివాసం విషయంలో వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తన కుమార్తె అంజలి రెడ్డి వివాహాన్ని బెంగళూరులోని యలహంక నివాసంలో నిర్వహించాలని భావించిన షర్మిల.. తాజాగా పెళ్లి వేదికను మరో ప్రాంతానికి మారుస్తున్నట్లు ప్రకటించారు.

ఆస్తుల పంపకంపై షర్మిల క్లారిటీ

యలహంక నివాసం విషయంలో వస్తున్న విమర్శలపై షర్మిల ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఆస్తుల పంపకాల్లో యలహంక నివాసం తనకు, తన పిల్లలకు పూర్తిగా దక్కిందని వెల్లడించారు. ఇది దేవుడి సాక్షిగా నిజమని పేర్కొన్నారు.

తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నివసించిన ఇల్లు కావడంతో పాటు, ఆ ఇల్లు తన పిల్లల హక్కు కావడంతో అక్కడే కుమార్తె వివాహం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అంజలి కూడా తన పెళ్లి తాను పెరిగిన ఇంట్లోనే జరగాలని కోరుకుందని చెప్పారు.

కుమార్తె కోరిక నెరవేర్చలేకపోయామని ఆవేదన

తెలుగింట్లో సొంత ఇంట్లో పిల్లల పెళ్లి చేయడం తల్లిదండ్రులకు అదృష్టమని షర్మిల పేర్కొన్నారు. అయితే తన కుమార్తె ఆకాంక్షను నెరవేర్చలేకపోతున్నందుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

యలహంక నివాసంలో పెళ్లి నిర్వహించడంపై అభ్యంతరాలు, భద్రతాపరమైన సమస్యలు తెరపైకి రావడంతో వివాహ వేదికను మరో చోటికి మార్చాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా ‘నాది కాని దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు’ అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *