ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి బిగ్ షాక్ తొలగింపుపై ప్రభుత్వం సంచలన నిర్ణయం ఇకపై వారికే..

Date:

ఏపీలో పింఛన్లు పొందుతున్నవారికి షాకింగ్ న్యూస్. పింఛన్ల పంపిణీలో పారదర్శకత తెచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అనర్హుల పింఛన్లను తొలగించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన చేసింది.

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకంపై ఏపీ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఈ పథకం ద్వారా వృద్దులకు ప్రతీ నెలా రూ.4 వేలు అందిస్తుండగా.. అంగవైకల్యంతో బాధపడేవారికి రూ.6 వేలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి రూ.10 వేలు అందిస్తోంది.

ప్రతీ నెలా ఒకటో తేదీన ఇంటి వద్దకే వెళ్లి లబ్దిదారులకు వీటిని పంపిణీ చేస్తున్నారు. ఇక 1వ తేదీ ఆదివారం వస్తే ముందు రోజే పింఛన్‌దారులకు అందిస్తున్నారు. మార్చి 1న ఆదివారం రావడంతో ఫిబ్రవరి 28న అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పింఛన్లపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

వీరి పింఛన్లు తొలగింపు
ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పొందుతున్నవారు గందరగోళానికి గురయ్యేలా షాకింగ్ ప్రకటన చేసింది ప్రభుత్వం. పింఛన్లు పొందుతున్నవారిలో ఎవరైనా అనర్హులు ఉంటే తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనర్హుల పింఛన్లను తొలగించే అధికారాలను జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో మంత్రి శ్రీనివాస్ దీని గురించి తాజాగా ప్రకటన చేశారు.

ఈ నిర్ణయం ద్వారా పథకంలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఇక అనర్హులపై ఎవరైనా ఫిర్యాదులు చేయొచ్చని, కలెక్టర్లు విచారణ నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. నిజమైతే నిర్ధారణ అయితే వెంటనే పింఛన్ తొలగించడం జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...