JEE Main 2027 Session 1 Registration: JEE Main 2027 Session 1 రిజిస్ట్రేషన్‌కు నేటితో గడువు ముగియనుంది. నవంబర్ 22 రాత్రి 11:50 గంటల వరకు లేట్ ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు మిస్ అయిన వారికి నవంబర్ 23 నుంచి 26 వరకు రూ.500 లేట్ ఫీజుతో అప్లై చేసే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ముఖ్యమైన అలర్ట్. JEE Main 2027 Session 1 రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. జనవరి 2027లో నిర్వహించనున్న జేఈఈ మెయిన్ తొలి సెషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 22, 2026 రాత్రి 11:50 గంటల వరకు అవకాశం ఉంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సాధారణ గడువులోగా దరఖాస్తు ఫారంతో పాటు పరీక్ష ఫీజును చెల్లిస్తే ఎలాంటి ఆలస్య రుసుము ఉండదు. గడువు మిస్ అయిన అభ్యర్థులకు కూడా మరో అవకాశం కల్పించారు. నవంబర్ 23 నుంచి నవంబర్ 26, 2026 వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సమయంలో అదనంగా రూ.500 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లేట్ ఫీజుతో దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు నవంబర్ 26 రాత్రి 11:50 గంటల వరకు అవకాశం ఉంటుంది.

JEE Main 2027 Session 1కు ఎలా అప్లై చేయాలి?

  • ముందుగా jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • JEE Main 2027 Session 1 అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అందుబాటులో ఉన్న లాగిన్ ఆప్షన్లతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
  • వ్యక్తిగత, విద్యా వివరాలను నమోదు చేయాలి.
  • అవసరమైన ధ్రువపత్రాలు, ఫొటోను అప్‌లోడ్ చేయాలి.
  • పరీక్ష ఫీజు చెల్లించి అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
  • చివరగా కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరచుకోవాలి.

NTA.. Meri Pehchaan ప్లాట్‌ఫామ్ ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించింది. అభ్యర్థులు DigiLocker సహా అందుబాటులో ఉన్న ధ్రువీకరణ మార్గాలను ఉపయోగించుకోవచ్చు.

JEE Main 2027 పరీక్ష తేదీలు

JEE Main 2027 Session 1 పరీక్షలు జనవరి 20, 21, 22, 23, 24, 28 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో జరుగుతాయి. రెండు సెషన్లకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు Session 2కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ సెషన్ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 7, 2027 వరకు నిర్వహించనున్నట్లు NTA షెడ్యూల్‌లో పేర్కొంది.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *