KCR: ఏం చేస్తారో చేయండి.. మా పెద్దిని కాపాడండి: ​వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్

Date:

తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సుమారు 45 నిమిషాల పాటు చర్చించి వివరాలు తెలుసుకున్నారు.

పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యున్నత స్థాయి వైద్యం అందిస్తున్నామని, అవసరమైతే విదేశీ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నామని వైద్యులు కేసీఆర్‌కు తెలిపారు. గుండె, ఊపిరితిత్తులు సహా ఇతర అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయని, అయితే మెదడు పూర్తిగా స్పందించేందుకు మరో 48 గంటలు పట్టే అవకాశం ఉందని వివరించారు.

ఈ సందర్భంగా “మీరేం చేస్తారో చేయండి… మా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడండి” అంటూ కేసీఆర్ వైద్యులకు చేతులెత్తి నమస్కరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన ధైర్యం చెప్పి, అవసరమైన అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...