
ఎ.కొండూరు: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రారంభమైన అత్యున్నత స్థాయి ‘లీడర్‌షిప్ కాంక్లేవ్’లో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. సెప్టెంబరు 7, 8 తేదీల్లో జరుగుతున్న ఈ సమావేశానికి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ముఖ్య ప్రసంగాలు చేశారు.
పార్టీ భవిష్యత్ కార్యాచరణ, నాయకత్వం, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చించేందుకు నిర్వహిస్తున్న ఈ కాంక్లేవ్‌లో మంత్రులు, ఎంపీలు, పొలిట్‌బ్యూరో సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై సమావేశంలో నాయకత్వం దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
