‘ఒక్క కాల్‌తో ఏపీకి స్టీల్‌ప్లాంట్ వచ్చింది’.. 2024లో జరిగిన ఆసక్తికర విషయాలు చెప్పిన లోకేష్

Date:

ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే అతి పెద్ద స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన జరిగింది. ఈ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ రాష్ట్రానికి రావడం వెనుక 2024లో ఓ జూమ్ కాల్ కారణమంటూ మంత్రి లోకేష్ ఆసక్తికర విషయాలు చెప్పారు. తాను 2019లోనే మిట్టల్ సంస్థ పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేశానని.. చివరికి 2024లో సక్సెస్ అయ్యామంటూ ఆ రోజు ఏం జరిగిందో మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు.

అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్‌ మిట్టల్, నిప్పన్‌ స్టీల్‌ ఇండియా స్టీల్‌ప్లాంట్‌‌కు శంకుస్థాపన జరిగింది. అయితే ఈ పరిశ్రమ రాష్ట్రానికి వచ్చేందుకు ఓ జూమ్ కాల్ కారణమంటూ మంత్రి లోకేష్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 2019 నుంచి 2024 వరకు ఏం జరిగిందో వివరించారు. తాను 2019 జనవరిలో దావోస్‌ పర్యటనకు వెళ్లినప్పుడు ఆర్సెలార్ మిట్టల్ సీఈవో ఆదిత్య మిట్టల్‌ను కలవడానికి ప్రయత్నించానన్నారు లోకేష్. కానీ ఆ సమయంలో కుదరలేదని.. అయితే ఆ తర్వాత ఆయన్ను కలిసే అవకాశం వచ్చిందన్నారు. ఆదిత్యను కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరానని.. ఆయన మాత్రం తాము వేరే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చూస్తున్నామని తనతో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకవేళ ఆ ప్రయత్నాలు జరగకపోతే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం సిద్ధంగా ఉందని ఆ రోజు ఆదిత్యకు చెప్పానన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిత్య మిట్టల్‌తో మాట్లాడిన ఓ జూమ్ కాల్‌ ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ను మార్చేసిందన్నారు.

2024 సెప్టెంబర్ 22న రాత్రి ఆదిత్య మిట్టల్‌తో తాను అరగంట పాటూ జూమ్ కాల్‌లో మాట్లాడానన్నారు మంత్రి లోకేష్. ఆ చర్చల ఫలితంగా.. దేశంలోనే అతి పెద్ద స్టీల్‌ప్లాంట్ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఈ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ రాక నిదర్శమన్నారు. ఆదిత్య మిట్టల్‌తో మాట్లాడిన తర్వాత రెండు నెలలకే ఏపీ ప్రభుత్వం నుంచి స్టీల్‌ప్లాంట్‌కు అవసరమైన ప్రోత్సాహకాలు అందించామన్నారు. మూడు నెలల్లో పరిశ్రమకు అవసరమైన భూమి.. ఆ వెంటనే పర్యావరణ, అటవీ అనుమతులు కూడా వచ్చాయన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...