LPG Booking Rules: గ్యాస్‌ వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్‌ మరో కొత్త రూల్‌.. సిలిండర్‌ బుకింగ్‌ గడువు పెంపు..!

Date:

LPG Booking Rules: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దాని ప్రభావం ఎస్‌పీజీ గ్యాస్‌ సిలిండర్లపై పడుతోంది. దీంతో దేశంలో గ్యాస్‌ సిలిండర్ల కొరత ఏర్పడుతోంది. ఇప్పుడు మళ్లీ బుకింగ్‌ నిబంధనలు మార్చింది. ఇప్పటికే బుకింగ్‌ గడువును పెంచగా, ఇప్పుడు మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

గ్యాస్ వినియోగదారులకు చమురు సంస్థలు కీలక మార్పులు ప్రకటించాయి. ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ సిలిండర్లు ఉన్న కుటుంబాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా సరఫరాపై ఒత్తిడి పెరగవచ్చని భావించి, ముందస్తు జాగ్రత్తగా ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు.

ఎవరికి ఎంత గ్యాప్? : అయితే కొత్త నియమాల ప్రకారం.. రెండు సిలిండర్లు ఉన్నవారు ఒకటి బుక్ చేసిన తర్వాత రెండో సిలిండర్ కోసం కనీసం 35 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది. అదే ఉజ్వల యోజన లబ్దిదారులకు ఈ గ్యాప్‌ను 45 రోజులకు పెంచారు. అలాగే ఒకే ఒక సిలిండర్ ఉన్నవారికి మాత్రం పాత విధానమే కొనసాగుతుంది. వారు 25 రోజుల తర్వాత మరోసారి బుక్ చేసుకోవచ్చు.

బుకింగ్‌కు కొత్త నిబంధనలు: ఏడాదికి కేటాయించిన 12 సిలిండర్ల కోటా పూర్తయితే అదనంగా బుక్ చేయాలంటే యాప్‌లో కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంట్లో సభ్యుల సంఖ్య, ప్రత్యేక కార్యక్రమాలు (శుభకార్యాలు), అతిథుల రాక వంటి వివరాలు ఇవ్వడం తప్పనిసరి.

డెలివరీ సమయంలో OTP నిర్ధారణ తప్పనిసరి అవసరం. e-KYC పూర్తి చేయడం తప్పనిసరి. లేదంటే బుకింగ్ రద్దయ్యే అవకాశం ఉంది. అందుకే గ్యాస్‌ సిలిండర్‌ కనెక్షన్‌ ఉన్న ప్రతి ఒక్కరు కేవైసీ పూర్తయ్యిందా ? లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం తెలిపిన ప్రకారం.. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. రిఫైనరీలు సాధారణంగానే పనిచేస్తున్నాయి.

కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న కొరతకు ప్రధాన కారణం పుకార్లు, ముందస్తు నిల్వలే అని అధికారులు చెబుతున్నారు. అందువల్ల వినియోగదారులు ఆందోళన చెందకుండా, అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయకుండా ఉండాలని, అధికారిక సమాచారాన్నే నమ్మాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం తెలిపిన ప్రకారం.. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి.

రిఫైనరీలు సాధారణంగానే పనిచేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న కొరతకు ప్రధాన కారణం పుకార్లు, ముందస్తు నిల్వలే అని అధికారులు చెబుతున్నారు. అందువల్ల వినియోగదారులు ఆందోళన చెందకుండా, అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయకుండా ఉండాలని, అధికారిక సమాచారాన్నే నమ్మాలని సూచిస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...