
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం చెత్త ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి నారాయణ (AP Minister Narayana) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం చెత్త ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లపాటు చెత్తపాలన సాగించారని సెటైర్లు గుప్పించారు. ఈరోజు(సోమవారం) నెల్లూరు జిల్లాలో పర్యటించి, పలు కార్యక్రమాల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో కోటి 53లక్షల టన్నుల చెత్త నిల్వలు పేరుకుపోయాయని అన్నారు.
మొత్తం చెత్తని క్లియర్ చేయమని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి నారాయణ అన్నారు. ఇప్పటికీ కోటీ 15లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేశామని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 10 వేస్ట్ ఎనర్జీ పవర్ ప్లాంట్లు మొదలుపెట్టామని.. వాటిలో రెండు పూర్తి చేశామని స్పష్టం చేశారు. జగన్ హయాంలో మిగిలిన వాటిని పూర్తిచేసి ఉంటే, ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్పుకొచ్చారు. ఏపీలోని ప్రధాన నగరాల్లో పీపీపీ పద్ధతిలో వేస్ట్ ఎనర్జీ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ABN , Publish Date – Mar

