D Spiritual: Nov 18: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం భక్తులు 22 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం పూర్తయ్యేందుకు సుమారు 6 నుంచి 8 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

ఇక మంగళవారం (నవంబర్ 17) మొత్తం 80,833 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 24,771 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.4.06 కోట్ల ఆదాయం లభించింది. అలాగే భక్తులకు 4 లక్షల లడ్డూ ప్రసాదాలను విక్రయించినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు తిరుమలలో గదుల లభ్యతకు సంబంధించి బుధవారం ఉదయం 6.29 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం.. రూ.50, రూ.100 అద్దె గదులు కలిపి 770 అందుబాటులో ఉన్నాయి. అయితే రూ.1,000, రూ.1,523 అద్దె గదులు ప్రస్తుతం ఖాళీగా లేవని టీటీడీ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *