మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్‌సీపీకి తగిన గుణపాఠం నేర్పాయని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష పార్టీలకు కనీసం నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కూడా కల్పించలేదని ఆయన విమర్శించారు.

For more: MPTC, ZPTC Elections Live Updates in DTV Digital

గత ప్రభుత్వ హయాంలో పలు ప్రాంతాల్లో ఏకగ్రీవాల పేరుతో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశారని ఆరోపించారు. అప్పట్లో ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులకు గురిచేసిన వైసీపీ నాయకులు, ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే ముందు గతంలో తమ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వైసీపీ నేతలు గుర్తు చేసుకోవాలని సూచించారు.