
నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మకూరుకు బయలుదేరిన శిల్పా చక్రపాణిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, శిల్పా చక్రపాణికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
For more: MPTC, ZPTC Elections Live Updates in DTV Digital
మరోవైపు పోలీసులకు, శిల్పా అనుచరులకు మధ్య తోపులాట జరగడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనతో నంద్యాలలో రాజకీయంగా వేడెక్కిన పరిస్థితులు కనిపించాయి.
