
పల్నాడు జిల్లాలోని నరసరావుపేట కౌంటింగ్ కేంద్రంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. AM రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ కౌంటింగ్ కేంద్రంలోని బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లతో పాటు కరపత్రాలు కూడా కనిపించాయి. సత్తెనపల్లి మండలం కంకాలపల్లి గ్రామానికి చెందిన ఓటర్లు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది.
గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఓటర్లు కరపత్రాల్లో తమ అభ్యర్థనలను వివరించారు. ముఖ్యంగా గ్రామానికి సమీపంలో నిర్మిస్తున్న U ఆకారపు రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.https://dtvandhrapradesh.com
ప్రతిపాదిత U ఆకారపు అండర్పాస్ కారణంగా స్థానికంగా అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కరపత్రాల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ నిర్మాణ విధానాన్ని పునఃపరిశీలించాలని, గ్రామస్థుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరారు.
ఈ సమస్యపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని ఓటర్లు విజ్ఞప్తి చేశారు. ప్రధాన రహదారికి బ్రిడ్జిని అనుసంధానించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో బ్యాలెట్ బాక్సుల్లో కరపత్రాలు బయటపడటం అక్కడ ఆసక్తికర చర్చకు దారితీసింది.
