పవన్ కళ్యాణ్ శాఖ దేశంలోనే నంబర్‌ వన్.. జాతీయ స్థాయిలో అవార్డులు..

Date:

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తు్న్న పంచాయతీరాజ్ శాఖకు జాతీయ స్థాయిలో అవార్డులు వరించాయి. రెండు విభాగాల్లో తొలిస్థానంలో నిలిచిన ఏపీ పంచాయతీరాజ్ శాఖ.. ఓ విభాగంలో రెండో స్థానంలో.. మరో రెండు విభాగాల్లో తృతీయ స్థానంలో నిలిచి అవార్డులు గెలుచుకుంది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, జల్ సంచయ్ -జన్ భాగీదారీ విభాగాల్లో తొలిస్థానంలో నిలిచింది. మొత్తంగా గతంలో 24వ ప్లేసులో ఏపీ పంచాయతీరాజ్ శాఖ .. నేడు దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది.

జాతీయ స్థాయిలో అవార్డులు పంట పండింది. ఏపీ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో రెండు విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఒక విభాగంలో ద్వితీయ స్థానంలో నిలవగా., మరో రెండు విభాగాల్లో మూడో స్థానంలో నిలిచి అవార్డులు గెలుచుకుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, వివిధ సేవల్లో మెరుగైన పనితీరు ఆధారంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది.

రాష్ట్రీయ గ్రామస్వరాజ్‌ అభియాన్‌, జల్‌ సంచయ్‌-జన్‌ భాగీదారి విభాగంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. గత ప్రభుత్వం హయాంలో 24వ స్థానంలో నిలిచిన ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ.. ఈసారి దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం విశేషం. గ్రామ పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించేలా చేయటం, అలాగే ప్రణాళికబద్ధమైన అభివృద్ధి కోసం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. అలాగే జల్ సంచయ్ – జన్ భాగీదారీ కార్యక్రమం కింద తక్కువ ఖర్చుతో వర్షపు నీటిని నిల్వచేసే పద్ధతులను ప్రోత్సహిస్తారు. ఈ రెండు విభాగాల్లో దేశంలోనే తొలి స్థానంలో ఏపీ పంచాయతీరాజ్ శాఖ నిలిచింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...