ఇబ్రహీంపట్నం ప్రాంతంలో గంజాయి వినియోగం, విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు నిఘా పెంచారు. సీఐ ఎ. సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రింగ్‌ సెంటర్‌, కొండపల్లి బ్యాంక్‌ సెంటర్‌ పరిసర ప్రాంతాలను డ్రోన్ల సాయంతో పరిశీలించారు.

గంజాయి వినియోగదారుల సమాచారాన్ని పోలీసులకు అందించి వారిని పట్టించేందుకు సహకరించే వారికి రూ.1,500 నగదు బహుమతి, గంజాయి విక్రయదారుల సమాచారం అందించిన వారికి రూ.5 వేల బహుమతి అందిస్తామని పోలీసులు ప్రకటించారు. ప్రజలు తమకు తెలిసిన సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు.

గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై పడే ప్రభావాలపై పోలీసులు యువతకు అవగాహన కల్పించారు. మద్యం సేవించే వారిని గంజాయి వినియోగదారులుగా పరిగణించవద్దని సూచించారు.

గంజాయి నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయంటూ ప్రచారం చేసే వదంతులను నమ్మవద్దని, అలాగే ఆన్‌లైన్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

ఈ తనిఖీల్లో ఎస్సై సత్యవతి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *