
గుడివాడ, గుడివాడ మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికల సందడి మొదలైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మెరుగుమాల ప్రవీణ పేరును మాజీ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (కొడాలి నాని) బలపరిచారు.
నామినేషన్ దాఖలు కార్యక్రమంలో భాగంగా నాగవరప్పాడు వంతెన సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం నుంచి వైసీపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి కొడాలి నాని ఈ ర్యాలీలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు.
ర్యాలీగా గుడివాడ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న మెరుగుమాల ప్రవీణ, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి సంఘీభావం తెలిపారు.
