చాపకింద నీరులా మళ్లీ విస్తరిస్తున్న మాయదారి ‘క్యూనెట్’ తాజాగా సోదాల్లో వెలుగులోకి సంచలనాలు!

Date:

నిరుద్యోగులు, ఐటీ ఉద్యోగులే టార్గెట్‌గా మోసాలకు పాల్పడుతున్న క్యూనెట్‌పై మరోసారి పంజా విసిరారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 30 చోట్ల సోదాలు జరిపిన పోలీసులు 32 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. క్యూనెట్ మోసాలపై వందల కేసులు నమోదయ్యాయని, దాంతో ఈ వ్యవహారంపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.

క్యూనెట్ పేరు చెప్పకుండా మంచి వ్యాపార అవకాశం అంటూ యువతను, ఐటీ ఎంప్లాయిస్‌ను ఈ ఊబిలోకి దించుతున్నారని చెప్పారు. మొదట్లో వెల్‌నెస్ ప్రాడక్ట్స్ పేరుతో కార్యకలాపాలు సాగించిన ఈ నెట్‌వర్క్. ఇప్పుడు బిస్కెట్లు, తేనె వంటి సాధారణ వస్తువులను కూడా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

గతంలో సంస్థ పేరు చెబుతూ కార్యకలాపాలు నిర్వహించగా ఇప్పుడు మాత్రం పేరు చెప్పకుండా బాండ్లు రాయించుకుని పెట్టుబడులు తీసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని సెకండ్ ఇన్‌కమ్ పేరుతో ఈ మోసాలు సాగుతున్నాయి. డబ్బులు లేని వారికోసం ఫిన్‌టెక్ సంస్థల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారు. నిరుద్యోగులను క్యూనెట్ వలలో దించేందుకు కల్చరల్, గేమింగ్ ఈవెంట్ల పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఆ సంస్థ ఏజెంట్లు. అలాగే గోవా, మలేషియా ట్రిప్‌లకు తీసుకువెళ్లడంతో పాటు కార్లు, విల్లాలు చూపిస్తూ మభ్య పెడుతున్నారు. ఫిన్‌టెక్ కంపెనీలతో మాట్లాడి లోన్‌లు కూడా వాళ్లే ఇప్పిస్తూ ఈ ఊబిలోకి దించుతున్నారు. క్యూనెట్ బారిన పడి గత ఏడాది హరికృష్ణ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడన్నాడు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఈ సంస్థపై 68 కేసులు నమోదు కాగా.. వాటిలో హైదరాబాద్ పరిధిలోనే 22 కేసులు ఉన్నాయి.

దీంతో క్యూనెట్‌వంటి సంస్థలు ఎలాంటి స్కీమ్‌లతో వచ్చినా కూడా ప్రజలు మోసపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రజలకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. అధిక లాభాల ఆశ చూపించే ఇటువంటి నెట్‌వర్క్ మార్కెటింగ్ సంస్థలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిజమైన వ్యాపారాల పేరుతో జరుగుతున్న ఈ మోసాలను గుర్తించి, ఎవరైనా ఇలాంటి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...