భారత ఒలింపిక్ సంఘం (IOA) అథ్లెట్స్ కమిషన్ చైర్‌పర్సన్‌గా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఎంపిక కావడంపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీవీ సింధుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆమెకు దక్కిన ఈ గౌరవం భారత క్రీడారంగానికి గర్వకారణమని పేర్కొన్నారు.

మంగళవారం అమరావతిలో మంత్రి మాట్లాడుతూ అథ్లెట్స్ కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఎన్నిక కావడం కూడా అభినందనీయమన్నారు. ఐఓఏ జనరల్ బాడీలో అథ్లెట్ ప్రతినిధులుగా మీరాబాయి చాను, సాజన్ ప్రకాష్ ఎంపిక కావడం సంతోషకరమని తెలిపారు.

అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చిన క్రీడాకారులకు కీలక బాధ్యతలు దక్కడం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. క్రీడాకారుల నాయకత్వం అనుభవంతో భారత క్రీడారంగం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రి నారా లోకేశ్ మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *