గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట.. కేంద్రం కీలక ప్రకటన.. ఇ-కేవైసీ వారికి మాత్రమే

Date:

ప్రస్తుతం దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత నెలకొంది. దీంతో కమెర్షియల్ సరఫరాపై పరిమితులు విధించారు. గృహ వినియోగానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇదే సమయంలో బ్లాక్ మార్కెట్‌ను నివారించేందుకు ఇ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గ్యాస్ సిలిండ్ వినియోగదారుల్లో గందరగోళం నెలకొంది. మళ్లీ కేవైసీ పూర్తి చేయాలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై తాజాగా మరో ప్రకటన చేసింది కేంద్రం. ఎవరు ఇ-కేవైసీ చేయాలి అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.

ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం రోజు రోజుకు మరింత తీవ్రమవుతుంది. దాదాపు రెండు వారాలుగా దాడులు జరుగుతున్నాయి. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం, గల్ఫ్ దేశాలపై దాడులతో ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హార్ముజ్ జలసంధి నుంచి నౌకలను ఇరాన్ అనుమతించకపోవడంతో భారత్‌లో ఎల్‌పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. వంట గ్యాస్ నిల్వలు తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం వాణిజ్య వినియోగంపై ఆంక్షలు విధించింది. గృహ వినియోగానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చమురు కంపెనీలను ఆదేశించింది. ఇదే సమయంలో బ్లాక్ మార్కెట్ పెరగకుండా, సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచకుండా చర్యలు చేపట్టింది. ఇదే సమయంలో గ్యాస్ వినియోగదారులు ఇ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఈ ఆదేశాలే గ్యాస్ వినియోగదారుల్లో గందరగోళానికి దారితీశాయి. ఇటీవలే కేవైసీ పూర్తి చేశామని, మళ్లీ ఇప్్పుడు పూర్తి చేయాలా? అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. గ్యాస్ ఏజెన్సీల వద్దకు కస్టమర్లు క్యూ కడుతున్నారు.

ఈ క్రమంలో కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన ద్వారా స్పష్టత ఇచ్చింది. ఎల్‌పీజీ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ (eKYC) అనేది కేవలం ఇప్పటి వరకు కేవైసీ పూర్తి చేయని కస్టమర్లకు మాత్రమేనని, అందరికీ కాదని తెలిపింది. ఎల్‌పీజీ కస్టమర్లందరూ మళ్లీ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరిగా పూర్తి చేయాలని వార్తలు వ్యాప్తి చెంది వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారని గుర్తించిన క్రమంలో ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Women and Thyroid: మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎందుకు ఎక్కువగా వస్తాయి? వైద్యులు చెబుతున్న కారణాలివే!

థైరాయిడ్ గ్రంథి శరీరానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ జీవక్రియ, శక్తి...

చక్కెర లేకుండానే మఖానా కీర్.. ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసా?

మఖానా కీర్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు...

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...