RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడుకుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?

Date:

అన్నమయ్య జిల్లాలో ఓ విచిత్ర ఘటన కలకలం రేపింది. కదిరి ఆర్టీసీ డిపోలో పార్క్ చేసి ఉంచిన AP39 UX 7686 నంబర్ గల ఆర్టీసీ బస్సును శివశంకర్ అనే వ్యక్తి అపహరించి పరారయ్యాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తన పెంపుడు కుక్కను కూడా బస్సులో ఎక్కించుకుని కదిరి నుంచి మదనపల్లె వైపు బస్సును నడిపిస్తూ వెళ్లాడు.

ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం.. శివశంకర్ బస్సును అత్యంత నిర్లక్ష్యంగా నడపడంతో మార్గమధ్యంలో పలుచోట్ల ఇతర వాహనాలు, రోడ్డు పక్కన ఉన్న నిర్మాణాలను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బస్సు ముందు అద్దాలు పూర్తిగా ధ్వంసమవగా, ఒక వైపు భాగం కూడా దెబ్బతిన్నట్లు సమాచారం.

చివరికి మదనపల్లె జాతీయ రహదారిపై తట్టివారిపల్లె వంతెన సమీపంలో బస్సును రోడ్డుపైనే నిలిపివేశాడు. స్థానికులు వెంటనే ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శివశంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో బస్సును ఎందుకు తీసుకెళ్లాడని ప్రశ్నించగా.. శివశంకర్ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతని మానసిక పరిస్థితి, ఘటనకు దారితీసిన పరిస్థితులపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పెంపుడు కుక్కతో కలిసి ఆర్టీసీ బస్సును తీసుకుని పరారైన ఈ విచిత్ర ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...