వైభవ్ సూర్యవంశీని వెంటనే ఇంగ్లండ్ టూర్‌కి సెలెక్ట్ చేయండి.. బీసీసీఐకి మైకేల్ వాన్ అర్జెంట్ రిక్వెస్ట్

Date:

ఐపీఎల్ బాస్ బేబీ వైభవ్ సూర్యవంశీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో 35 బంతుల్లో సెంచరీ చేసిన వైభవ్.. ఈ ఏడాది ఆరంభంలోనే 15 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వైభవ్ సూర్యవంశీ ఆటను చూసిన మైకెల్ వాన్ అర్జెంట్‌గా ఇంగ్లండ్ టూర్‌కి తీసుకురావాలంటూ బీసీసీఐకి సూచించాడు. సీనియర్ జట్టుతో కలిసి ఉండటం వైభవ్‌కు చాలా అవసరమని, ఆడినా ఆడకపోయినా జట్టులో ఉంచాలంటూ వాన్ చెప్పాడు.

ఐపీఎల్ సంచలన స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆటతీరుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే వైభవ్ ఆడుతున్న తీరు ప్రపంచ దిగ్గజ బ్యాటర్లను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఐపీఎల్ 2025లో సెంచరీతో పాటు ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ప్రత్యర్థి బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. వైభవ్ ఆటకు ఫ్యాన్ అయిపోయిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ .. వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలంటూ బీసీసీఐకు రిక్వెస్ట్ చేశాడు.

గువాహటి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు చేసి, పూర్తిగా మ్యాచ్‌ని వన్ సైడ్ చేశాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 36 బంతుల్లో 38 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 127 పరుగులకే ఆలౌట్ కాగా.. రాజస్థాన్ రాయల్స్ కేవలం 12.1 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...