
ధనుష్, మలయాళ అగ్రనటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం’. సాయి పల్లవి, శ్రీలీల కథానాయికలుగా కనిపించనున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రద్ధా అగర్వాల్, ధనుష్, అజ్మత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా ‘షేర్ ఆఫ్ అరేబియా..’ అంటూ సాగే పాటను విడుదల చేసింది. మమ్ముట్టి, ధనుష్ స్టైలిష్ లుక్స్, వారి అదిరిపోయే స్వాగ్తో ఈ పాట సాగుతుంది. పాటలోని విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఈ గీతానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించగా, తమిళ్ అధవన్తో కలిసి ఆయనే ఆలపించారు. విడుదలైన కొద్దిసేపటికే ఈ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ముఖ్యంగా మమ్ముట్టి, ధనుష్‌ల స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
