తలలో పేలు పోవాలంటే పాటించాల్సిన సింపుల్‌ చిట్కాలు

Date:

తలలో పేలు చాలా వేగంగా రెట్టింపవుతాయి. తొలుత ఇవి రాకుండానే చూసుకోవాలి కానీ ఓసారి వచ్చాయంటే మాత్రం అంత తేలికగా వదిలి పెట్టవు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తూ ఉంటాయి. పేలున్న వ్యక్తి వాడిన దువ్వెన మరొకరు వాడడం, పక్కపక్కనే నిద్రపోవడం వల్ల పేలు ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తాయి. తల్లో పేలుంటే తలలో బాగా దురద వస్తుంది. ముఖ్యంగా తల వెనక భాగంలో కూడా దురద వస్తుంది. పేలు ఎక్కువైతే తల చర్మంపై ఎర్రని మచ్చలు ఏర్పడుతాయి. మరి వీటిని సులభంగా ఎలా పరిష్కరించుకోవచ్చో తెలుసుకుందాం.

తలలో పేలు ఉంటే మహా చిరాకుగా ఉంటుంది. పైగా పేలు ఒక్కసారి వచ్చాయంటే అంత సులువుగా వదిలిపోవు. రోజురోజుకూ పెరుగుతూ పోతూనే ఉంటాయి. వదిలించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతకంటే వేగంగా మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉంటాయి. తొలగించడానికి చాలానే శ్రమ పడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక్కసారి పేలు వచ్చాయంటే దెబ్బ తింటుంది. దీంతో జుట్టు రాలిపోతూ ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా తరచూ తలలో దురద పెడుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో పేలు పోగొట్టేందుకు పాటించాల్సిన సులువైన, సహజమైన పద్ధతులు ఏంటో తెలుసుకుందాం.

ఈ వేప నూనె తలలో పేలు సమస్యకు అత్యంత ప్రభావవంతమైన పరిష్కారం. వేపనూనెలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. అంతే కాకుండా అజాడిరాక్టిన్‌ అనే పదార్థం కూడా ఉంటుంది. ఇవన్నీ పేలను చంపడమే కాకుండా గుడ్లు పెట్టకుండా నిరోధిస్తుంది. వారంలో రెండు లేదా మూడు రోజులు రాత్రి పడుకునే ముందు వేప నూనెను జుట్టు మూలాలకు బాగా అప్లయ్‌ చేయాలి. మరుసటి రోజు ఉదయం షాంపూతో తల స్నానం చేస్తే పేలు సమస్య తగ్గుముఖం పడుతుంది. అలాగే వేప ఆకులను మెత్తగా నూరి తలకు ప్యాక్‌లా వేసి గంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే కూడా చుండ్రు వంటి సమస్యలు తగ్గుతాయని పేర్కొంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...