
పొందూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్ణ సచివాలయం–3ను ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సులభంగా అందేలా చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలను వేగంగా, పారదర్శకంగా అందించాలని సిబ్బందికి సూచించారు. స్వర్ణ సచివాలయం–3 అందుబాటులోకి రావడంతో పొందూరు పట్టణ ప్రజలు ప్రభుత్వ సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమకు సమీపంలోనే సేవలు పొందే అవకాశం కలిగిందన్నారు.
ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేలా సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
