శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. రేణిగుంట, ఏర్పేడు, తొట్టంబేడు మండలాల్లో జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నారు. దీంతో కూటమి నాయకులు, కార్యకర్తల్లో విజయోత్సాహం నెలకొంది.

రేణిగుంట మండలంలో మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అందులో 17 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా టీడీపీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ ఒక స్థానాన్ని దక్కించుకుంది.

ఇక ఏర్పేడు మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు గాను 15 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఒక్క స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు.

తొట్టంబేడు మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఆరు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ నాలుగు స్థానాలను గెలుచుకుంది. బీజేపీ ఒక స్థానాన్ని, వైసీపీ మరో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.

మొత్తంగా మూడు మండలాల్లోనూ టీడీపీ అత్యధిక ఎంపీటీసీ స్థానాలను దక్కించుకోవడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. స్థానిక ఎన్నికల ఫలితాలు నియోజకవర్గ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

By Rajini