కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా ప్రచురణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 23న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. తుది ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 2న ప్రచురించనున్నారు.

ఈ రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీ ప్రచురణకు గతంలో ప్రకటించిన షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

కొత్త షెడ్యూల్ ప్రకారం డిసెంబరు 18 నాటికి రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ ముద్రణ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అనంతరం నిర్ణీత తేదీల్లో ముసాయిదా తుది జాబితాలను ప్రచురించనున్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *