
అనంతపురంలోని కక్కలపల్లి క్రాస్ టమోటా మార్కెట్‌లో టమోటా ధరలు స్వల్పంగా నమోదయ్యాయి. కిలో టమోటా గరిష్ఠ ధర రూ.27గా పలికినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు ఇన్‌చార్జ్ కార్యదర్శి మల్లిక తెలిపారు.
మార్కెట్‌లో టమోటా కిలో సరాసరి ధర రూ.24గా ఉండగా.. కనిష్ఠ ధర రూ.17గా నమోదైనట్లు ఆమె వెల్లడించారు. మంగళవారం మార్కెట్‌కు మొత్తం 1,200 టన్నుల టమోటా కాయలు వచ్చినట్లు తెలిపారు.
చీనీ కాయలు టన్ను గరిష్ఠంగా రూ.15 వేలు
అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో చీనీ కాయలకు గరిష్ఠ ధర టన్నుకు రూ.15 వేలుగా నమోదైంది. ఈ విషయాన్ని మార్కెట్ ఎంపిక శ్రేణి కార్యదర్శి గోవిందు తెలిపారు.
మంగళవారం మార్కెట్‌కు 20 టన్నుల చీనీ కాయలు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. టన్ను సరాసరి ధర రూ.11,500గా ఉండగా.. కనిష్ఠ ధర రూ.8 వేలుగా నమోదైనట్లు తెలిపారు.
