ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ దాఖలు చేసిన కేసులో అమెరికా విదేశాంగశాఖ భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది. ఈ కేసులో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా) మాజీ అధిపతి సమంత్ గోయల్‌తో పాటు పలువురు భారతీయ అధికారులను ప్రతివాదులుగా పన్నూ పేర్కొన్నాడు.

దీంతో వారందరికీ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. గత నెల 9వ తేదీన అమెరికా విదేశాంగశాఖ ఈ సమన్లను వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయానికి పంపించింది. అమెరికా పౌరుడైన గురుపత్వంత్ సింగ్ పన్నూ తనను హత్య చేసేందుకు భారత ప్రభుత్వం కుట్ర పన్నిందని గతంలో ఆరోపిస్తూ అమెరికా కోర్టులో కేసు దాఖలు చేశాడు.

ఈ కుట్రలో భాగంగా నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని నియమించారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఆరోపణలపై అమెరికా దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో నిఖిల్ గుప్తాను 2023 జూన్‌లో చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లో అరెస్టు చేశారు.

అనంతరం అతడిని అమెరికాకు అప్పగించారు. మరోవైపు భారతీయ అధికారులకు అమెరికా సమన్లు జారీ చేయడంపై భారత విదేశాంగశాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఖండించింది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *