
లక్షా 60 వేల మందికి పైగా ఓటర్లు ఉన్న తిరుపతి రూరల్ జెడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చిన్న కుమారుడు టీడీపీ అభ్యర్థి ధనలక్ష్మిపై 602 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఫలితంపై టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి ఆసక్తికరంగా స్పందించారు.
తాము తొలుత రీకౌంటింగ్‌కు వెళ్లాలని భావించినట్లు ఆమె తెలిపారు. అయితే, ఈ ఎన్నికల్లో కూడా ఓటమి ఎదురైతే చెవిరెడ్డి డిప్రెషన్లోకి వెళ్లిపోతారని బతిమాలడంతో రీకౌంటింగ్ ఆలోచనను విరమించుకున్నామని వ్యాఖ్యానించారు. తిరుపతి రూరల్ జెడ్పీటీసీ ఫలితం నేపథ్యంలో సుధారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తిరుపతి రూరల్ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి ముచ్చెలి ధనలక్ష్మిపై 602 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపులో హర్షిత్‌రెడ్డికి 41,119 ఓట్లు పోలవగా, ధనలక్ష్మికి 40,517 ఓట్లు వచ్చాయి. దీంతో వైసీపీ కీలక నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు తిరుపతి రూరల్ జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. స్వల్ప ఓట్ల తేడాతో వెలువడిన ఈ ఫలితం స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
తిరుపతి రూరల్ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితంపై చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి స్పందించారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని భావించడంతో తొలుత రీకౌంటింగ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే చెవిరెడ్డి కుటుంబం విజ్ఞప్తి చేయడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నామని ఆమె వెల్లడించారు.
టీడీపీ అభ్యర్థి ధనలక్ష్మి గతంలో చెవిరెడ్డి కుటుంబంతో సంబంధాలు ఉన్న వ్యక్తి అని సుధారెడ్డి పేర్కొన్నారు. చెవిరెడ్డి కుటుంబం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె తమ వైపు వచ్చి ఎన్నికల్లో పోటీ చేశారని తెలిపారు. అయితే వారంతా బంధువులేనని కూడా వ్యాఖ్యానించారు.
రీకౌంటింగ్ ఎందుకు కోరలేదంటే..
‘‘చెల్లని ఓట్లు సుమారు 2 వేల వరకు ఉన్నాయి. కానీ గెలుపోటముల మధ్య తేడా కేవలం 600 ఓట్లే. దీంతో రీకౌంటింగ్ కోరాలని భావించాం. ఇప్పటికే రిటర్నింగ్ అధికారికి రీకౌంటింగ్ కోసం లేఖ కూడా సమర్పించాం. అయితే అవతలి వైపు ఉన్నది చిన్నవాడు కావడంతో చెవిరెడ్డి కుటుంబం విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఇద్దరు ఎన్నికల్లో ఓడిపోయారని, చిన్న కుమారుడు కూడా ఓడిపోతే డిప్రెషన్లోకి వెళ్లిపోతాడని కోరారు. దీంతో ధనలక్ష్మి పెద్ద మనసుతో రీకౌంటింగ్ ఆలోచనను విరమించుకుంది. పండుగ నేపథ్యంలో రెండు రోజుల తర్వాత రీకౌంటింగ్ చేపట్టాలని కూడా కోరాం’’ అని సుధారెడ్డి వివరించారు.
తిరుపతి రూరల్ జెడ్పీటీసీ ఎన్నికల్లో 602 ఓట్ల స్వల్ప మెజారిటీతో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి విజయం సాధించిన నేపథ్యంలో సుధారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.
‘నేను ఓడిపోయాను.. నా పెద్ద కుమారుడు కూడా ఓటమి పాలయ్యాడు. ఇప్పుడు చిన్న కుమారుడు కూడా ఓడిపోతే డిప్రెషన్లోకి వెళ్లిపోతాడని వేడుకోవడంతో ధనలక్ష్మి పెద్ద మనసుతో రీకౌంటింగ్ ఆలోచనను విరమించుకుంది. వాస్తవానికి ఆమె ఈ విజయాన్ని భిక్షంలా ఇచ్చినట్టే. అంతేకాదు, చెవిరెడ్డి, ధనలక్ష్మి కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉంది’’ అని సుధారెడ్డి వ్యాఖ్యానించారు.
అంతకుముందు మీడియాతో మాట్లాడిన పులివర్తి సుధారెడ్డి.. తిరుపతి రూరల్ జెడ్పీటీసీ పరిధిలో లక్షన్నర మందికి పైగా ఓటర్లు ఉండటంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యమైందని తెలిపారు. చిన్నగొట్టిగల్లు, తిరుపతి రూరల్ మండలాల్లో వైసీపీ అభ్యర్థికి ఆధిక్యం లభించిందని పేర్కొన్నారు. చిన్నగొట్టిగల్లు మండలాన్ని జనసేనకు కేటాయించినట్లు వెల్లడించారు.
తిరుపతి రూరల్ మండలం చెవిరెడ్డి కుటుంబానికి సొంత ప్రాంతమని సుధారెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారని, ఆయన కుమారుడు కూడా చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి కుటుంబంపై ప్రజల్లో సానుభూతి ఏర్పడి ఉండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. కుటుంబంలో అందరూ ఓడిపోవడం మంచిది కాదనే ఉద్దేశంతో ఓటర్లు చిన్న కుమారుడికి మద్దతు ఇచ్చి ఉండొచ్చని సుధారెడ్డి వ్యాఖ్యానించారు.
తిరుపతి రూరల్‌తో పాటు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పందించారు. ఎన్నికల సమయంలో టీడీపీ భారీగా రౌడీలను రంగంలోకి దించి పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించిందని ఆరోపించారు. జిల్లా స్థాయి నాయకులంతా చంద్రగిరిపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారని విమర్శించారు. అయినప్పటికీ చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వైసీపీ తన సత్తా చాటిందని పేర్కొన్నారు.
చంద్రగిరిలో మూడు జెడ్పీటీసీ స్థానాలు గెలిచాం
‘‘1.60 లక్షల మంది ఓటర్లు ఉన్న తిరుపతి రూరల్ జెడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. చంద్రగిరిలో నా కుమారుడితో పాటు మరో ఇద్దరు జెడ్పీటీసీ అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం ఆరు స్థానాల్లో మరో రెండు చోట్ల రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించాం. ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశాం. టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎన్నికలు జరిగిన మండలాల్లో మూడింటిలో వైసీపీ విజయం సాధించింది. మరో మూడు స్థానాల్లో ఆరు నెలల్లో రీపోలింగ్ జరిగే అవకాశం ఉంది’’ అని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు.
గెలిచిన అభ్యర్థులకు అభినందనలు
ఈ సందర్భంగా మూడు స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన తన కుమారుడు, చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన మోహిత్‌రెడ్డిని చెవిరెడ్డి అభినందించారు. తెల్లవారుజామునే విజయం ఖరారైనప్పటికీ ఇప్పటివరకు ఎన్నికల అధికారులు గెలుపు ధ్రువీకరణ పత్రం (డిక్లరేషన్) అందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘‘డిక్లరేషన్ ఇస్తే తీసుకుంటాం.. లేకపోతే వెళ్లిపోతాం. గెలిచిన తర్వాత ధ్రువీకరణ పత్రం తీసుకోవడానికి కూడా పోరాటం చేయాల్సి రావడం బాధాకరం’’ అని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నా
