Weather Report: ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. వాతావరణశాఖ బిగ్ అప్డేట్..

Date:

ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశముంది. ఈ మేరకు వాతావరణశాఖ స్పష్టం చేసింది. పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. రాబోయే మూడ్రోజుల్లో ఏపీ, తెలంగాణకు వర్షసూచన జారీ అయింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాబోయే మూడ్రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుందంటే..

సముద్ర మట్టానికి ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, ఆగ్నేయ రాజస్థాన్, దాని పరిసర ప్రాంతాలలోని అల్పపీడన ప్రాంత కేంద్రం, గుణ, సిద్ధి, డాల్టన్‌గంజ్ మీదుగా వెళ్లి అక్కడి నుండి ఆగ్నేయంగా ఈశాన్య బంగాళాఖాతం వైపుకు విస్తరిస్తోంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడ్రోజుల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా ఏపీలో రాగల మూడు రోజుల వరకు వానలు కురవనున్నాయని అమరావతి వాతావరణశాఖ స్పష్టం చేసింది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది . బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. ఇక ఈరోజు, రేపు, ఎల్లుండి  దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. ఇక రాయలసీమలో రాబోయే మూడ్రోజుల పాటు వానలు పడతనున్నాయి. అటు రాగల 3 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణము కంటే 2 -4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...