
మెగా డీఎస్సీ ద్వారా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులకు శుభవార్త. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు వారికి 4 సీఎల్స్, 1 ఐచ్ఛిక సెలవు, 2 ప్రత్యేక సీఎల్స్, లేడీ టీచర్లకు అదనంగా మరో ప్రత్యేక సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో వారి సెలవుల సమస్య పరిష్కారమైంది. మొత్తం 15,941 మంది కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది మెగా డీఎస్సీ ద్వారా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ప్రభుత్వ టీచర్లకు పండగే. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. కొత్త టీచర్లకు సెలవులు మంజూరు చేస్తూ ఆ శాఖ డైరెక్టర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ‘అక్టోబరు నుంచి డిసెంబరు వరకు సీఎల్స్ 4, ఐచ్ఛిక సెలవు (ఆప్షనల్ హాలిడే) ఒకటి, ప్రత్యేక సీఎల్స్ 2, ఉపాధ్యాయినులకు (లేడీ టీచర్లకు) అదనపు ప్రత్యేక సెలవు ఒకటి’ చొప్పున మంజూరు చేశారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన టీచర్లు తమకు సెలవులు కావాలని కోరారు.. దీంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారికి సెలవులు మంజూరు చేసింది. మొత్తానికి వీరి సెలవుల సమస్య పరిష్కారం అయ్యింది.. వారికి సెలవులు మంజూరు కావడంతో ఆనందంలో ఉన్నారు. ఈ ఏడాది నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా 15,941 మంది కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరిన సంగతి తెలిసిందే.
