
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన నేతగా మెలోనీ రికార్డు సృష్టించిన సందర్భంగా మోదీ ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు.
మెలోనీ 1,413 రోజుల పాటు నిరంతరాయంగా ప్రధానిగా కొనసాగి, గతంలో సిల్వియో బెర్లుస్కోనీ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. ఈ ఘనత మెలోనీ నాయకత్వంపై ఇటలీ ప్రజలు ఉంచిన నమ్మకానికి, విశ్వాసానికి నిదర్శనమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మెలోనీకి ప్రధాని మోదీ అభినందనలు
ఇటలీ రాజకీయ చరిత్రలో జార్జియా మెలోనీ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఇటలీలో అత్యంత సుదీర్ఘకాలం కొనసాగిన ప్రభుత్వంగా మెలోనీ సర్కారు నిలిచింది. వరుసగా 1,413 రోజుల పాటు అధికారంలో కొనసాగిన ఆమె ప్రభుత్వం.. గతంలో మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ ప్రభుత్వం నెలకొల్పిన రికార్డును అధిగమించింది.
ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ.. జార్జియా మెలోనీకి అభినందనలు తెలిపారు. మెలోనీ నాయకత్వంపై ఇటలీ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ఈ రికార్డు నిదర్శనమని పేర్కొన్నారు. భారత్-ఇటలీ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో మెలోనీ స్నేహం, నాయకత్వం కీలక పాత్ర పోషిస్తున్నాయని మోదీ కొనియాడారు.
2022 అక్టోబర్ 22న ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జార్జియా మెలోనీ.. అప్పటి నుంచి రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటూ తన ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఎలాంటి పెద్ద రాజకీయ సంక్షోభం లేకుండా సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగడం ద్వారా ఆమె ఇటలీ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
మెలోనీ ప్రభుత్వం సాధించిన ఈ రికార్డుపై ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఇటలీ ప్రజలు ఆమె నాయకత్వంపై ఉంచిన నమ్మకానికి ఇది ప్రతిబింబమని పేర్కొన్నారు. భారత్, ఇటలీ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో మెలోనీతో ఉన్న స్నేహం, పరస్పర సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు.
