రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) CEN 09/2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ తదితర విభాగాల్లో మొత్తం 191 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 4, 2026లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు, విద్యార్హతలు, వయోపరిమితి, జీతభత్యాలు, ఎంపిక విధానం తదితర పూర్తి వివరాలు తెలుసుకోండి..

భారతీయ రైల్వేలోని వివిధ ఐసొలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) CEN నెం. 09/2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 191 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న పోస్టులు, ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

పోస్టుల వివరాలు..

  • చీఫ్ లా అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 17
  • పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల సంఖ్య: 21
  • సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్ పోస్టుల సంఖ్య: 8
  • జూనియర్ ట్రాన్స్‌లేటర్ (హిందీ) పోస్టుల సంఖ్య: 79
  • స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల సంఖ్య: 27
  • సైంటిఫిక్ అసిస్టెంట్ (ట్రైనింగ్) పోస్టుల సంఖ్య: 3
  • ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ III (కెమిస్ట్ అండ్ మెటలర్జిస్ట్) పోస్టుల సంఖ్య: 36

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు చివరి తేదీ నాటికి గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి సంబంధిత పోస్టును బట్టి విద్యార్హత కలిగి ఉండాలి. 10+2 లేదా తత్సమాన అర్హతతో పాటు సైన్స్ సబ్జెక్టులు, డిగ్రీ, లా డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా వంటి అర్హతలు పోస్టును బట్టి అవసరం. ఫైనల్ పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు. పోస్టులను బట్టి అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 22 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుంది. నిబంధనల ప్రకారం అర్హులైన కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఈ అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలు, వయోపరిమితి, పోస్టుల వివరాలను పూర్తిగా పరిశీలించాలి. అనంతరం అవసరమైన వివరాలను నమోదు చేసి, ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేసి, నిర్ణీత దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (EBC) అభ్యర్థులు రూ.250, ఇతర అభ్యర్థులు రూ.500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కింది దశలు ఉంటాయి. సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ట్రాన్స్‌లేషన్ టెస్ట్ (జూనియర్ ట్రాన్స్‌లేటర్ హిందీ పోస్టులకు మాత్రమే), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్.. ఈ దశల ఆధారంగా మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.19,900 నుంచి రూ.44,900 వరకు జీతం చెల్లిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *